![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -32 లో.....సూర్య ఫ్యాన్ రిపేర్ చేస్తుంటే షాక్ కొట్టి కిందపడిపోతుంటాడు. అప్పుడే జానూ వచ్చి పట్టుకుంటుంది. భువన చూసి నువ్వు ఏంటి ఇక్కడ అని కోప్పడుతుంది. బాబు గారు పడిపోతుంటే అమ్మాయి పట్టుకుందని తుఫాన్ చెప్పగానే ఎందుకు వాడితో పని చేయించావని తుఫాన్ ని భువన కొడుతుంది. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని జానూని భువన అడుగుతుంది. ఏంటి సూర్య మీ అమ్మకి అన్ని తెలుసంటావ్.. ఇంటికి వచ్చిన వాళ్లతో ఇలాగేనా మాట్లాడేది అని జానూ అంటుంది.
అప్పుడే పనిమనిషి భువనకి కాఫీ తీసుకొని వస్తుంది. అది జాను తీసుకొని ఛీ ఇది ఎలా ఉంది.. ఇంత సంపాదించారు.. కాస్త షుగర్ వేసుకోవచ్చు కదా అని జానూ అంటుంది. సూర్య నీతో మాట్లాడాలి పక్కకి రా అని జానూ అంటుంది. నా కొడుకుతో ఏం మాట్లాడాలి ఇక్కడే మాట్లాడమని భువన అంటుంది. సరే అని తోటకి డబ్బు నాన్న పూర్తిగా చెల్లించలేదట ఇల్లుపై లోన్ తీసుకొని కట్టాలనుకుంటున్నానని జానూ అనగానే వద్దని సూర్య అంటాడు. అయినా డబ్బు మొత్తం కట్టాడు కదా అని భువన అనగానే లేదంట సింహాద్రి అంకుల్ చెప్పాడని జానూ చెప్తుంది. అన్నయ్య చెప్పాడంటే అది నిజమే అని భువన అంటుంది. అన్ని అన్నయ్యకే చెప్పాలా నువ్వు చూసుకోవచ్చు కదా అని భువన అనగానే నాకు ఆ తోట అమ్మిన వాళ్ళ ఇల్లు తెలియదని జానూ అనగానే నేను చెప్తానని భువన అంటుంది. దాంతో ఐ లవ్ యు ఆంటీ అని జానూ అంటుంది. మరొకవైపు పక్క ఊళ్ళో దొంగలు పడ్డారని శారద వాళ్ళ దగ్గరికి మురళి వచ్చి చెప్తాడు. అప్పుడే బ్యాంకు నుంచి సింహాద్రి పంపిన వాళ్ళు ఇల్లుని సీజ్ చెయ్యడానికి వస్తారు.. కానీ వాళ్ళు దొంగలు అనుకొని వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళు పారిపోయేలా చేస్తారు.
ఆ తర్వాత జానూ తోట అమ్మిన అతని ఇల్లు వెతుక్కుంటూ వెళ్తుంది. అందరిని అడుగుతుంది. నేను చెప్పాలా అంటూ సూర్య మాస్క్ పెట్టుకొని వచ్చి జానూని ఆటపట్టిస్తాడు. తరువాయి భాగంలో ఇల్లు సీజ్ చెయ్యడానికి బ్యాంకు వాళ్ళు పోలీసులని తీసుకొని వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |